శ్రీశైలంలో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం

వాస్తవం ప్రతినిధి: కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం బీభత్సం సృష్టించింది. శ్రీశైలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వద్ద అన్నదానసత్రం, పరిపాలనా భవనం వద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దాదాపు గంటపాటు కురిసిన ఈ వర్షానికి అక్కడ వేసిన చలువపందిళ్లు చెల్లాచెదరుగా కూలిపోగా మూడు భారీవృక్షాలు నేలకొరిగాయి.