సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామంలో విషాదం..ప్రేమ జంట ఆత్మహత్య

వాస్తవం ప్రతినిధి: సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కనకయ్య, తార అనే ప్రేమ జంట… స్థానిక సర్కారు బడిలోని క్లాస్ రూమ్ లో ఉరి వేసుకొని అత్మహత్యకు పాల్పడ్డారు.

లకుడారం గ్రామానికి చెందిన మండే కనకయ్య, రాచకొండ తార గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో మందలించారు. మనస్తాపానికి గురైన కనకయ్య, తార ముందుగా వెంట తెచ్చుకున్న విషం తాగారు. తర్వాత పాఠశాల లోని ఓ గదిలోకి వెళ్లి , ఓకే తాడుతో ఇద్దరు ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కుకునూరుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.