కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై అన్ని పిటిషన్లను విచారించేందుకు హైకోర్టు అంగీకారం తెలిపింది. పిటిషన్లపై స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చేసింది. కాళేశ్వరం దాని అనుబంధ ప్రాజెక్టులపై 175 పిటిషన్లు దాఖలయ్యాయి.
కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టును కేవలం రెండు మూడెకరాలు ఉన్న భూయజమానుల కోసం ఆపలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం తీసుకోవాలని నిర్వాసితులకు హైకోర్టు సూచించింది. అయితే పరిహారంలో అన్యాయం జరిగితే తమ వద్దకు రావొచ్చని న్యాయస్థానం సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన 175 కేసులను హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించాలన్న ప్రభుత్వ పిటిషన్‌ను హైకోర్టు అంగీకరించింది. పిటిషన్లు అన్నీ కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.