బీజేపీ వాళ్ల వినాశనాన్ని వాళ్లే కొనితెచ్చుకుంటున్నారు: సాధినేని యామిని

వాస్తవం ప్రతినిధి: ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్నట్లు అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడే ఇలాంటి పనులు చేస్తారని, బీజేపీ వాళ్ల వినాశనాన్ని వాళ్లే కొనితెచ్చుకుంటున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని అన్నారు. ఓ ప్రముఖ చానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ
ఏపీలో బీజేపీ చేష్టలతో ప్రజల కడుపు మండిపోతోందని , అందుకే, ఏపీలో బీజేపీ అగ్రనేతలు పర్యటించిన సమయంలో ప్రజలు నిరసన తెలపడం ద్వారా తగినబుద్ధి చెప్పారని అన్నారు.

బీజేపీ పరిపాలన లేని రాష్ట్రాల్లో తాము తలచుకుంటే ఆ ప్రభుత్వాలు ఉంటాయా? అంటూ ఆ పార్టీ నేత రఘురాం చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీల పట్ల బీజేపీ తీరు ఎలా ఉందో చెప్పడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు. దేశంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, చివరకు సీఈసీపై ఉన్న నమ్మకాన్ని కూడా పోగొట్టేలా బీజేపీ చేసిందని దుయ్యబట్టారు.