సోనియాగాంధీ నుంచి ఆహ్వానమందుకొన్న స్టాలిన్

వాస్తవం ప్రతినిధి: డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్‌కు యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ నుంచి ఆహ్వానం అందిందని డీఎంకే పేర్కొంది. ఈ నెల 23న ఢిల్లిలో జరిగే ప్రతిపక్షాల భేటీకి స్టాలిన్‌ను రావాల్సిందిగా సోనియాగాంధీ ఆహ్వానించారని డీఎంకే తెలిపింది. ప్రతిపక్షాల సమావేశానికి రావాలని స్టాలిన్ ను సోనియాగాంధీ ఆహ్వానించినట్లు గత రెండు రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.