కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాబూమోహన్‌

వాస్తవం ప్రతినిధి: కర్ణాటకలోని చించోళి అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు అక్కడి బీజేపీ అభ్యర్థి తరపున తెలుగు సినీ హాస్య నటుడు బాబూమోహన్‌ బుధవారం ప్రచారం చేశారు. బీదర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే చించోళి అసెంబ్లీ ప్రాంతం తెలంగాణ సరిహద్దులో ఉంది. చించోళి, కలబురిగి ప్రాంతాల్లో తెలంగాణ జిల్లాల నుంచి ఉపాధి వెతుక్కుంటూ వచ్చిన తెలుగు ప్రజలు అధికంగా ఉన్నారు. దీంతో భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థికి మద్దతుగా బాబూమోహన్‌ను రంగంలోకి దించింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఉమేష్‌ జాదవ్‌ పోటీ చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఉమేష్‌జాదవ్‌ ఆ తర్వాత బీజేపీలోకి ఫిరాయించారు. తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.