కర్ణాటకలో కలకలం రేపుతున్న కుమారస్వామి వ్యాఖ్యలు

వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఆ పార్టీకి చేసిన సేవలకు సరైన గుర్తింపు దక్కలేదని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నేళ్ల క్రితమే ఖర్గే ముఖ్యమంత్రి కావాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఖర్గేకు అన్యాయం జరిగిందనేది తన అభిప్రాయమని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కర్ణాటకలో కలకలం రేపుతున్నాయి.

మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకునే కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు, కాంగ్రెస్ కండువా కప్పుకుని కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేయడంతో… కాంగ్రెస్ నేతలు షాక్ కు గురయ్యారు. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న కుమారస్వామి… ఈ వ్యాఖ్యల ద్వారా ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకున్నారనే విషయంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.