సంజీవయ్య పార్కులో నర్సరీ వద్ద అగ్ని ప్రమాదం

వాస్తవం ప్రతినిధి: హైదరాబాద్ నగరంలోని సంజీవయ్య పార్కులో నర్సరీ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. నర్సరీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. నర్సరీలో షార్ట్ సర్క్యూట్‌ కారణంగా మొదలైన అగ్ని ప్రమాదంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. పార్క్ వద్ద ఉన్న చెట్లు మంటల్లో ఆహుతి అవుతుండగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.