జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

వాస్తవం ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఇవాళ ఉదయం గోదావరిఖని నుంచి భూపాలపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు మల్హార్ మండలం అడవిసోమన్ పల్లి బ్రిడ్జి సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 63 మంది ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల్లో కొంతమంది తీవ్రంగా గాయపడడంతో వారిని మహాదేవపూర్‌ ఆస్పత్రికి తరలించారు.