పపువా న్యూ గినియా లో భారీ భూకంపం

వాస్తవం ప్రతినిధి: పపువా న్యూ గినియాను భారీ భూకంపం కుదిపేసింది. రాబౌల్‌లో 7.5 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సునామీ భయంతో వణికిపోయారు. అయితే, సునామీకి సంబంధించి ఎటువంటి సూచనలు లేవని అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా సంభవించిన ప్రాణ, ఆస్తినష్టం గురించి సమాచారం అందాల్సి ఉంది. భూకంపం చాలా బలంగా సంభవించిందని, ప్రకంపనలతో రాబౌల్ నగరం ఊగిపోయిందని పోలీసులు తెలిపారు. రాబౌల్‌కు తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది