టీమిండియానే ఈ ప్రపంచ కప్‌ లో హాట్‌ ఫేవరెట్‌ : అజారుద్దీన్‌

వాస్తవం ప్రతినిధి: ఈ ప్రపంచకప్‌ ను గెలిచే సత్తా భారత్‌ కు ఉందని టీమిండియా మాజి కెప్టెన్‌ అజారుద్దీన్‌ పేర్కొన్నారు. టీమిండియానే ఈ ప్రపంచ కప్‌ లో హాట్‌ ఫేవరెట్‌ అని చెప్పారు. ఇంగ్లండ్‌ టూర్‌ కు వెళ్లినప్పుడు అద్భుతంగా బౌలింగ్‌ చేసిన బౌలర్లు తమకు ఉన్నారన్నారు. అక్కడి పిచ్‌ లు బౌలర్లకు అనుకూలిస్తే మనకు ఇబ్బంది ఎదురవుతుందని చాలా మంది అంటున్నారని… ప్రత్యర్థి జట్టును ఆలౌట్‌ చేయగల సత్తా ఉన్న బౌలర్లు మనకూ ఉన్నారని చెప్పారు. మన బ్యాటింగ్‌ లైనప్‌ కూడా అద్భుతంగా ఉందన్నారు. ఇంతటి బలమైన జట్టుతో మనం ప్రపంచ కప్‌ గెలవకపోతే… తాను చాలా నిరాశకు గురవుతానని చెప్పారు. రెండు, మూడు స్థానాలను ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలకు ఇస్తానని అజారుద్దీన్‌ పేర్కొన్నారు.