వాట్స‌న్ పై అభిమానుల ప్రశంసల వర్షం

వాస్తవం ప్రతినిధి: ముంబైతో జరిగిన ఐపీఎల్‌ ఫైనల్స్‌లో చెన్నై ఒక్క‌ప‌రుగు తేడాతో ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. చెన్నై గెలుపుకోసం చివ‌రివ‌ర‌కు వాట్స‌న్ వీరోచిత పోరాటం చేసినా చివ‌ర‌కు విజ‌యం ముంగిట బోల్తాప‌డ్డాడు. వాట్స‌న్ అవుట్ అవ్వ‌డానికి ముందు ఫిల్డింగ్ స‌మ‌యంలో వాట్సన్‌ మోకాలి వద్ద గాయమైంది. కానీ.. మేనేజ్‌మెంట్‌కి చెప్పకుండా ఆ గాయంతోనే అతను మ్యాచ్‌లో కొనసాగాడు. ర‌క్తం కారుతున్నా చెన్నై గెలుపుకోసం వీరోచితంగా పోరాటం చేసినా జ‌ట్టు ఓట‌మిపాల‌య్యింది. దీంతో వాట్స‌న్ పై అభిమానులు పొగ‌డ్త‌ల‌తో మెంచెత్తుతున్నారు. ఉత్కంఠగా సాగడంతో మ్యాచ్‌ జరుగుతున్నంత సేపూ ఈ గాయాన్ని కూడా ఎవరూ చూడలేదు.

సీఎస్కే జట్టు సభ్యుడు హర్భజన్ సింగ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఈ విషయాన్ని షేర్ చేశాడు. దీన్ని చూసిన వారంతా ‘వాట్సన్ గ్రేట్’ అని కితాబిస్తున్నారు. అతని అభిమానులంతా నువ్వే గ్రేట్ వాట్సాన్ అంటూ …అతడి కాలు నుంచి రక్తం కారుతున్న ఫోటోలు పోస్టు చేసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆట‌ముగిసిన త‌ర్వాత వాట్స‌న్ గాయానికి ఆరు కుట్లు ప‌డిన‌ట్లు స‌మాచారం.