మరో క్రేజీ హీరోయిన్ కి లిప్ లాక్ పెట్టబోతున్న విజయ్ దేవరకొండ..!

వాస్తవం సినిమా: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇమ్రాన్ హష్మి ముద్దులకు స్పెషలిస్ట్ అని అంటుంటారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇమ్రాన్ హష్మి మాదిరిగానే విజయ్ దేవరకొండ కూడా ముద్దులకు స్పెషలిస్ట్ అయిపోతున్నట్లు తెలుస్తోంది. ఇమ్రాన్ హష్మి మాదిరిగానే లిప్ లాక్ పెట్టడంలో ఇండస్ట్రీలో చాలా ముందు ఉంటున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పటివరకు కెరీర్ లో నటించిన అన్ని సినిమాలలో విజయ్ దేవరకొండ లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో కూడా లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ లో లిప్ లాక్ సీన్ పెట్టి మరింత హైప్ తీసుకొచ్చారు. తాజాగా దర్శకుడు క్రాంతి మాధవ్ తో కలిసి మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇందులో రాశిఖన్నాతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. రొమాంటిక్ ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ముద్దు సన్నివేశాలకు పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. కథ డిమాండ్ చేయడంతో విజయ్-రాశిఖన్నాల మధ్య ఓ గాఢముద్దు సన్నివేశం ఉండబోతుందట. ఈ సీన్ ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేస్తారని సినిమాకి ఇదే హైలెట్ అవుతుందని అంటున్నారు సినిమా యూనిట్. ఏకంగా రెండు మూడు నిమిషాలు ఈ సీన్ ఉంటుందని ఫిలింనగర్ టాక్.