నాగార్జున జీవితంలో మర్చిపోలేని తేదీ నాడు మన్మధుడు -2 రిలీజ్..?

వాస్తవం సినిమా: టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా తర్వాత చేసిన ఏ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో నాగార్జున తన కెరియర్ లో అప్పట్లో సూపర్ డూపర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన మన్మధుడు సినిమా కి సీక్వెల్ స్టార్ట్ చేశారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున పక్కన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా..సమంతా.. కీర్తి సురేష్ లు అతిధి పాత్రలో మెరుస్తున్నారు. ఇదిలావుండగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పోర్చుగల్ లో ముగించుకున్న సినిమా యూనిట్ ఈ నెల 21 నుంచి తదుపరి షెడ్యూల్ లో హైదరాబాదులో జరుపుకోనున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ సినిమాకి సంబంధించి విడుదలకు సంబంధించిన ఆసక్తికరమైన తేదీ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. అదేమిటంటే… నాగార్జున 60వ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆగస్టు 29న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంద‌ట‌. గతంలో ఈ సినిమాని జులై మాసం లో విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా కింగ్ నాగార్జున పుట్టినరోజు సినిమాను విడుదల చేస్తే బాగుంటుందని సినిమా యూనిట్ దానికి ప్లాన్ చేశారట. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.‘మన్మథుడు’కి కొనసాగింపుగా వస్తున్న ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండ‌గా… నాగార్జున‌, పి.కిర‌ణ్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.