తీవ్ర ఉద్రిక్తతలతో అట్టుడుకుతున్న పశ్చిమ బెంగాల్‌

వాస్తవం ప్రతినిధి: తీవ్ర ఉద్రిక్తతలతో పశ్చిమ బెంగాల్‌ అట్టుడుకుతోంది. బీజేపీ-టీఎంసి పార్టీల మధ్య నిన్న మొదలైన గొడవలు కాస్త ఈరోజు తారాస్థాయికి చేరి ఒకరిపై ఒకరు తీవ్ర దాడులకు దిగుతున్నారు. నిన్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ర్యాలీని టీఎంసీ కార్యకర్తలు అడ్డుకోవడంతో రెచ్చిపోయిన బీజేపీ కార్యకర్తలు టీఎంసి కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. యూనివర్సిటీ లోపలకు వెళ్లి విద్యార్థులఆపై దాడులు చేసి వాహనాలను తగలబెట్టారు. ఈరోజు ఉదయం నుండి బీజేపీ కార్యకర్తలు-టీఎంసీ కార్యకర్తలు ఎక్కడ దొరికితే అక్కడ రాళ్లు రువ్వుకుంటూ కర్రలతో కొట్టుకుంటున్నారు. పోలీసులు పరిస్థితిని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నా రెండు వర్గాలు పోలీసుల కళ్లుగప్పి దాడులకు దిగుతున్నారు.