తిరుమల రెండవ ఘాట్‌ రోడ్‌లో రోడ్డు ప్రమాదం

వాస్తవం ప్రతినిధి: తిరుమల రెండవ ఘాట్‌ రోడ్‌లో తిరుమల భక్తులు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. ఇవాళ తిరుమల రెండవ ఘాట్‌ రోడ్‌లో వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ గాలి బీభత్సం ఉధృతంగా ఉండటంతో బస్సును లెఫ్ట్‌ కు తిప్పాడు. దీంతో బస్సు 25 అడుగుల లోతులో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పది మంది భక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.