అబ్బ అదిరిపోయింది జగన్ ప్లాన్ చంద్రబాబుపై..?

వాస్తవం ప్రతినిధి: దాదాపు పది సంవత్సరాల కిందట ఒక ముఖ్యమంత్రి కొడుకు గా ఉన్న జగన్ ఒక జాతీయ పార్టీని ఎదిరించి ఆ పార్టీలో నుండి ఒంటరిగా బయటికి వచ్చి తన తండ్రిని ఆదరించిన రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో అవమానాలు నిందలు పడటం జరిగింది. అంతేకాకుండా లేనిపోని అవినీతి ఆరోపణలు కూడా జగన్ ఎదుర్కొనడం జరిగింది. ఏది ఏమైనా తన తండ్రిని ఆదరించిన ప్రజల కోసం మరియు తండ్రి లేని తనకి అండగా నిలబడిన రాష్ట్ర ప్రజల కోసం ఏదైనా ఎంతకైనా చేయాలనే ఉద్దేశంతో తన తండ్రి పేరిట వైయస్ఆర్సిపి పార్టీని స్థాపించి తెలుగు రాష్ట్ర రాజకీయాలలో కొత్త చరిత్రకు నాంది పలికారు జగన్. అయితే అనుకోని అనివార్య కారణాలవల్ల ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో ఆంధ్రా లో కీలకంగా మారిన వైఎస్ఆర్ సీపీ పార్టీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కి దిమ్మతిరిగిపోయే విధంగా రాజకీయం అంటే ఏంటో జగన్ చూపించడం నిజంగా ఆశ్చర్యమైన విషయమని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు కామెంట్ చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో తనని పది సంవత్సరాల పాటు రాజకీయంగా పలు రకాలుగా ఇబ్బంది పాలు చేసిన చంద్రబాబుకి తగిన గుణపాఠం చెప్పడానికి జగన్ రెడీ అయినట్లే అంటూ తెలుగు రాష్ట్రాల్లో వినబడుతున్న టాక్. తాజాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసన జరిగిన ఎన్నికల్లో వైసిపి పార్టీ గెలవడం ఖాయం అని అన్ని సర్వేలలో తేలటంతో చంద్రబాబుని దెబ్బ కొట్టడానికి ఆయన తోడల్లుడు పర్చూరు వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీనియర్ రాజకీయ నేత దగ్గుబాటి వెంకటేశ్వర రావు ని సీన్ లోకి జగన్ దింపడానికి రెడీ అయినట్లు సమాచారం. రాజకీయాల్లో దగ్గుబాటి కంటే బాబు దిట్ట‌.చంద్రబాబుపై పొలిటికల్‌గా రివెంజ్ తీర్చుకోవాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న దగ్గుబాటి… ఇందుకోసం ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోరని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్ప‌టికే ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డిని కేబినెట్‌లోకి తీసుకుంటానని ఇప్పటికే జగన్ ప్రకటించారు. దీంతో ద‌గ్గుపాటిని మంత్రిగా తీసుకొనే అవ‌కాశాలు శూన్యం. అందుకే ఆయ‌న‌కు స్పీక‌ర్ ప‌ద‌విని ఇవ్వాల‌ని జ‌గ‌న్ మొగ్గు చూపుతున్న‌ట్లు తెలుస్తోంది .దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పీకర్ స్థానంలో కూర్చుంటే చంద్రబాబు ఆయనను అధ్యక్షా… అధ్యక్షా అని సంభోదించాల్సి ఉంటుంది. ఇది ఒక రకంగా చంద్రబాబుకు ఇబ్బంది కలిగించే విషయమే. పైగా బాబుపై పైచేయి సాధించిన‌ట్లే. దీంతో ఈ వార్త వెంటనే చాలామంది రాజకీయ విశ్లేషకులు చిన్న వయసులో ఉన్నా గానీ జగన్ రాజకీయంగా చంద్రబాబు ని ఉక్కిరి బిక్కిరి చేయడం స్టార్ట్ అయ్యిందని కామెంట్ చేస్తున్నారు.