వైయస్ జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేసింది ఆ వ్యక్తే..?

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలవడం ఖాయం అని జగనే ముఖ్యమంత్రి అని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు రాష్ట్రంలో జరిగిన సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ఈ సందర్భంగా జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేsea ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు ఇటీవల వార్తలు వినపడ్డాయి. ఇదిలా ఉండగా తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాల విషయంలో పోలింగ్ కౌంటింగ్ రోజు పార్టీకి చెందిన నేతలతో వైయస్ జగన్ భేటీ అవుతున్నట్లు పార్టీ వర్గాల నుండి వస్తున్న సమాచారం. ఈ సందర్భంగా ఈనెల 22వ తారీఖున తాడేపల్లి లో కట్టుకున్న తన నివాసానికి పూర్తిగా తన మకాం మార్చినట్లు లోటస్ పాండ్ నుండి ఫర్నిచర్ మొత్తం తాడేపల్లి కి ఇటీవల తరలించినట్లు..ఇక 22వ తారీకు నుండి పూర్తిగా జగన్ తాడేపల్లి లో నుండే పార్టీ వ్యవహారాలను సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారని అంటున్నారు చాలామంది పార్టీకి చెందినవారు. కాగా, వైసిపి గెలిస్తే జగన్ ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతూ వస్తోంది. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన నాడీ జ్యోతిష్కుడు కాళిదాస్ ఆ ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు ప్రచారం సాగింది. అయితే, అది వాస్తవం కాదని వైసిపి వర్గాలంటున్నాయి. వాస్తవానికి వైఎస్ జగన్ ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారైందని అంటున్నారు. విశాఖకు చెందిన శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ఈ ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది. స్వరూపానందేంద్ర స్వామి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అధికారికంగా మాత్రం ఫలితాలు వెలువడ్డాక పార్టీకి చెందిన నేతలు ఈ ప్రకటన చేయనున్నట్లు సమాచారం.