భార్యను ఉద్దేశించి మోడీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మాయావతి…!

వాస్తవం ప్రతినిధి: భారతీయ సమాద్ వాది పార్టీ అధినేత్రి మాయావతి ఇటీవల జాతీయ రాజకీయాలలో కీలకంగా మారుతున్నారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని రాబోతున్న ఎన్నికలలో ఎలాగైనా గద్దె దించాలని ఎప్పటినుండో శత్రువుగా ఉండే పార్టీ సమాజ్వాదీ పార్టీతో మాయావతి చేతులు కలపడం జరిగింది. ఈ సందర్భంగా దేశ స్థాయిలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో మాయావతి ప్రధాని మోడీ పై ఆయన భార్య ను ఉద్దేశించి షాకింగ్ కామెంట్లు చేసినట్లు సమాచారం. రాజకీయ ప్రయోజనాల కోసం సొంత భార్యనే వదిలేసిన వ్యక్తి.. ఇతరుల అక్కాచెల్లెళ్లను, భార్యలను ఏ విధంగా గౌరవిస్తారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి ప్రశ్నించారు. బీజేపీలోని మహిళా నేతలు తమ భర్తలు మోదీ వద్దకు వెళ్తుంటే ఆందోళన చెందుతున్నట్టు నాకు తెలిసింది. మోదీలాగే తమ భర్తలు కూడా తమను వదిలేస్తారని వారు భయపడుతున్నారు అని మాయావతి వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తికి (మోదీకి) ఓటు వేయొద్దని మహిళలకు ఆమె సూచించారు. మోదీ భార్యకు వారిచ్చే అసలైన గౌరవం కూడా ఇదేనని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఇటీవల ఓ పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారట. దీంతో మాయావతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.