సోనియా సమావేశం.. టీడీపీ, టీఆర్‌ఎస్‌, వైసీపీలకు ఆహ్వానాలు

వాస్తవం ప్రతినిధి: మే 23వ తేదీన ఢిల్లీలో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ నేతృత్వంలో నిర్వహించ తలపెట్టిన బీజేపీయేతర పక్షాల భేటికి తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ విపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డికి ఆహ్వానాలు అందాయట. ఈ సమావేశాలకు వీరిని ఆహ్వానిస్తూ సోనియా గాంధీ స్వయంగా లేఖలు రాశారని సమాచారం. మే 23వ తేదీనే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నందున అధికార బీజేపీకి ఫలితాలు అనుకూలంగా లేకపోతే భవిష్యత్తు కార్యాచరణకు ఈ సమావేశం దిశానిర్దేశం చేసేలా ఉండాలనేది సోనియా ఆలోచనగా తెలుస్తోంది. అందుకే ఇటు యూపీయే, అటు ఎన్టీయేలో భాగస్వాములుకాకుండా తటస్థంగా ఉన్న పార్టీలు సమావేశానికి హాజరు కావాలని సోనియా ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా టీడీపీతోపాటు టీఆర్‌ఎస్‌, వైసీపీలకు కూడా ఆహ్వానాలు అందినట్లు సమాచారం.