మహేష్ బాబు ముద్దు పై కామెంట్స్ చేసిన డైరెక్టర్ ఎస్.జె.సూర్య..!

వాస్తవం సినిమా: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటించిన ‘మహర్షి’ సినిమా ఇటీవల విడుదలై మంచి సక్సెస్ సాధించడంతో సినిమా యూనిట్ మొత్తం సక్సెస్ సంబరాలు చేసుకుంటున్నారు. మహేష్ కెరీర్లో 25వ సినిమా గా తెరకెక్కిన ఈ సినిమా మహేష్ కెరీర్లోనే నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు అత్యంత లాభాలు తెచ్చి పెట్టిన సినిమాగా విశిష్టత దక్కించుకుంది. అయితే తన కెరియర్ లో ఇంత మంచి సక్సెస్ అందించిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి కి హీరో మహేష్ బాబు ముద్దు పెడుతూ ఒక పోస్టు సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రకరకాలుగా ఈ ఫోటోలపై మహేష్ అభిమానులు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ముద్దుపై నటుడు ఎస్.జె.సూర్య కొన్ని కామెంట్స్ చేశారు. మహేష్ నటించిన ‘స్పైడర్’ సినిమాలో విలన్ గా నటించి ఆకట్టుకున్నాడు ఎస్.జె.సూర్య. తాజాగా మహేష్, వంశీకి ముద్దు పెట్టిన ఫోటో చూసిన సూర్య.. మహేష్ ముద్దు ఎంత నిజాయితీగా ఉంటుందో తనకు వ్యక్తిగతంగా తెలుసునని అన్నాడు. సినిమా పట్ల తన ప్రేమను, గౌరవాన్ని చాటడానికే ఇచ్చినట్లు సినిమా చూసిన తరువాత తనకు అర్ధమైందని అన్నారు. ఈ సినిమా ద్వారా అందరికీ మంచి ఫీలింగ్ కలిగిస్తున్నందుకు మహేష్, వంశీలకు థాంక్స్ చెప్పాడు సూర్య.