కోలీవుడ్ పై కన్నేసిన మెగా హీరో..?

వాస్తవం సినిమా: మెగా కాంపౌండ్ నుండి చాలా మంది హీరోలు వెండితెరకు పరిచయమై మెగా అభిమానుల మన్ననలను చాలామంది పొందుకున్నారు. అయితే అల్లు బ్రదర్స్ లో అల్లు శిరీష్ మాత్రం ఎన్ని సినిమాలు చేసినా మెగా అభిమానులను పెద్దగా మెప్పించలేకపోయారు. చేసిన సినిమాలు మొత్తం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడటంతో అల్లు శిరీష్ ఎలాగైనా హిట్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని డిఫరెంట్ జానర్ లో తెరకెక్కిన ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ఏబీసీడీ సినిమాతో రాబోతున్నాడు. వరుస ఇంటర్వ్యూలతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తోన్న శిరీష్ తన మనసులోని మరో కోరికను ఇటీవల బయటపెట్టాడు. బాలీవుడ్ లో ఎంట్రీ పై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. అప్పుడే బాలీవుడ్ లోకి వెళ్లాలనే కొరిక ఏమి లేదని అంటూ.. తెలుగు సినిమాలు చేసుకోవడం హ్యాపీగా ఉందని అన్నాడు. అదే విధంగా కుదిరితే తమిళ్ సినిమాలో నటించాలని కోరికగా ఉందని అల్లు శిరీష్ వివరణ ఇచ్చాడు. అయితే ఇటీవల కొన్ని ఆఫర్లు అల్లు శిరీష్ కి వచ్చినా కానీ వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ సరైన స్టొరీ తో తమిళ ప్రజలను ఆకట్టుకోవడానికి అల్లు శిరీష్ తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫిలింనగర్ టాక్. ముఖ్యంగా అల్లు అర్జున్ కి కోలీవుడ్ ఇండస్ట్రీలో మరియు మల్లువుడ్ ఇండస్ట్రీలలో మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో అన్న క్రేజ్ తో సరైన హిట్టు కొట్టి కోలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోదామనే ఆలోచనలో అల్లు శిరీష్ ఉన్నట్లు ఇండస్ట్రీలో తెగ వార్తలు వినబడుతున్నాయి.