ఏకధాటిగా షూటింగ్ చేస్తున్న నాని..?

వాస్తవం సినిమా: ‘జెర్సీ’ సినిమా విజయంతో ఫుల్ జోష్ మీద ఉన్న నాని తన తదుపరి సినిమా ని తొందరగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ కాంబినేష‌న్‌లో నాని ‘గ్యాంగ్ లీడర్’ అనే సినిమా చేస్తున్న సంగతి మనకందరికీ తెలిసినదే. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో… ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. అనిరుధ్‌ రవిచందర్ సంగీత‌మందిస్తున్న ఈ సినిమాని హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ‌ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఒకసారి సినిమా స్టోరీ గమనిస్తే వేర్వేరు ఏజ్ గ్రూప్‌ల‌కి చెందిన ఐదుగురు మహిళల గ్యాంగ్‌కు లీడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించే ఓ యువ‌కుడి చుట్టూ తిరిగే క‌థ‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం… ఇప్ప‌టికే కొంత‌మేర షూటింగ్ జ‌రుపుకుంది. కాగా… మరో రెండు రోజుల్లో తదుపరి షెడ్యూల్‌ను కూడా ప్రారంభించనున్నారని స‌మాచారం. ఇందులో భాగంగా… హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో వేసిన ఓ ప్రత్యేక ఇంటి సెట్‌లో 45 రోజులపాటు ఏకధాటిగా సినిమా షూటింగ్ జరపడానికి సినిమా యూనిట్ ప్లాన్ చేసినట్లు సమాచారం. చాలా తొందరగా ఈ సినిమా షూటింగ్ ముగించుకొని ఆగస్టు నెలలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.