ఎఫ్-21 విమానయాన సంస్థ నుంచి ఇండియాకు బంపరాఫర్!

వాస్తవం ప్రతినిధి: అమెరికన్ ఏరో స్పేస్ జెయింట్ కంపెనీ ప్రపంచ దేశాలన్నిటికీ యుద్ధ విమానాల్ని సరఫరా చేసే కంపెనీల్లో అతి పెద్దది. దాదాపు 150 బిలియన్ డాలర్ల బడా సైజ్ మార్కెట్ కలిగిన ఈ సంస్థ ఇప్పుడు.. ఇండియాకు కన్ను గీటుతోంది. లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ కొత్తగా తయారు చేసే F-21 విమానాల్ని కేవలం ఇండియాకు మాత్రమే అమ్ముతామంటూ ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చారు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ వివేక్ లాల్. మొత్తం 114 ఎఫ్-21 జెట్స్ కొనుగోలుకు ఆర్డర్ పెడితే.. మిమ్మల్ని మా ‘గ్లోబల్ ఫైటర్ ఎకోసిస్టం’లో చేర్చుకుంటాం అంటూ హామీ ఇస్తున్నారాయన. పైగా.. ‘తమ విమానాల్ని కొనడానికి ఇండియా కమిటైతే.. మరే దేశానికీ ఈ విమానాల్ని అమ్మబోమ’ని కూడా లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ డిసైడ్ అయింది.