అగ్రరాజ్యం అమెరికా లో మరోసారి కాల్పుల మోత

వాస్తవం ప్రతినిధి: అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. మిస్సోరీలోని సెయింట్‌ లూయీస్‌ నగరంలో గల ఓ ఇంట్లోకి దుండగులు చొరబడి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. అమెరికా కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ష్రెవె 4000 బ్లాక్‌లోని ఓ ఇంట్లో కాల్పులు జరిగినట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇంటి ముందు ఓ వ్యక్తి, ఇంట్లో మరో నలుగురు బుల్లెట్‌ గాయాలతో కన్పించారు. వీరిలో ముగ్గురు అప్పటికే మృతిచెందగా.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితులంతా 20 నుంచి 30ఏళ్ల మధ్య ఉన్న నల్లజాతీయులని వెల్లడించారు. అయితే కాల్పులు ఎవరు జరిపారన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు