ధోనీ కూడా మానవమాత్రుడే: కుల్దీప్ యాదవ్

వాస్తవం ప్రతినిధి: ధోని మేటి కీపర్‌.. సూపర్‌ ప్లేయర్‌.. అంతకు మించి తెలివైన కెప్టెన్‌. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ కదలికలకు అనుగుణంగా కెప్టెన్సీ చేయడంలో ఆరితేరిన ధోనీ అవసరానికి తగ్గట్లు అప్పటికప్పుడు ప్లాన్స్‌ మారుస్తుంటాడు. నిజానికి కోహ్లీ కెప్టెన్ అయినా గ్రౌండ్‌లో మాత్రం కెప్టెన్ ధోనినే. టీమిండియాకు సారథ్యం వహించినప్పటి నుంచే వేగంగా వ్యూహాలు రచించడంలో నైపుణ్యం సాధించిన ధోనీ.. విశ్లేషకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు.

కానీ తాజాగా యువ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ మాత్రం ధోనిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ కూడా ఆలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. ధోనీ ఇచ్చే సూచనలు చాలా సార్లు తప్పాయంటున్నాడు యువ స్పిన్నర్‌ కుల్దీప్ యాదవ్. ధోనీ కూడా మానవమాత్రుడేనని, ఆయన సూచనలు చాలాసార్లు పనిచేయలేదని చెప్పుకొచ్చాడు.ముంబైలో జరిగిన సియెట్‌ క్రికెట్‌ రేటింగ్‌ అవార్డ్స్‌ ఫంక్షన్‌ సందర్భంగా కుల్దీప్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.