నాలుగు రాష్ట్రాల హైకోర్టులకు సీజేల నియామకానికి ‘సుప్రీం’ కొలీజియం సిఫారసు

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ హైకోర్టుల సీజేల నియామకానికి కొలీజియం సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ను, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సీజేగా జస్టిస్ వి.రామసుబ్రమణియన్, ఢిల్లీ హైకోర్టు సీజేగా జస్టిస్ డీఎన్. పటేల్, మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా జస్టిస్ ఏఏ ఖురేషిని కొలీజియం సిఫారసు చేసింది.

కాగా, ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక సీజేగా చౌహాన్, న్యాయమూర్తిగా జస్టిస్ వి.రామసుబ్రమణియన్ కొనసాగుతున్నారు.