టీవీ 9 ని తొక్కేయడం కోసం భారీ స్కెచ్ సిద్ధం ?

వాస్తవం ప్రతినిధి: తెలుగు న్యూస్ ఛానల్ విషయంలో టిఆర్పి రేటింగ్స్ లో ఎప్పుడూ ముందుండే ఛానల్ టీవీ9 ఛానల్. గత కొంత కాలం నుండి టీవీ9 ఛానల్ ని ఏ చానల్ కూడా ఈ స్థానం నుండి రీప్లేస్ చేయలేక పోయింది. ముఖ్యంగా తెలుగు మీడియా రంగంలో ఎప్పుడూ కూడా టీవీ9 మరియు ఈనాడు కి సంబంధించిన చానల్స్ మాత్రమే మీడియా రంగంలో టాప్ లో ఉంటాయి. ముఖ్యంగా టీవీ9 ఆ స్థానంలో ఉండటానికి గల ప్రప్రథమ కారణం రవి ప్రకాష్ మరియు అతని బృందం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే తాజా పరిస్థితుల్లో టీవీ9 లో రవిప్రకాశ్ లేకపోవడంతో మిగతా చానల్స్ ఇదే సమయమని రవిప్రకాశ్ టీమ్ నుంచి ఎవరైనా బయటకు వస్తారేమో అంటూ తమ ఛానల్ లో చేరుతారు ఏమో అంటూ వాకబు మొదలెట్టేశారు. మరి కొంతమంది అయితే ఎలాగైనా ఈసారి టీవీ9 ఛానల్ టిఆర్పి రేటింగ్స్ లో తొక్కేయాలని ఆ స్థానాన్ని రీప్లేస్ చేయాలని ఇప్పుడే పావులు కదుపుతున్నట్లు టాక్ వినపడుతోంది. అయితే మరోపక్క టీవీ9 నుండి బయటకు వచ్చిన రవిప్రకాష్ కూడా టీవీ9 కి తగిన విధంగా బుద్ధి చెప్పాలని కొన్ని కొత్త చానల్స్ ని కొనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుగు మీడియా రంగంలో వినపడుతున్న టాక్.