పక్కా హిట్ కొట్టే డైరెక్టర్ తో మాస్ మహారాజ్ – ఇక తిరుగులేని సినిమా రాబోతోంది !

వాస్తవం సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీ మాస్ మహారాజా రవితేజ హిట్టు కొట్టి చాలా కాలం అవుతుంది. ఈ మధ్య చేస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో బయట మార్కెట్ కూడా తగ్గిపోవడంతో ఏమి చేయలేని స్థితిలో ప్రస్తుతం రవితేజ ఉన్నట్లు ఫిలింనగర్ టాక్. ఇదిలా ఉండగా ప్రస్తుతం డిస్కో రాజా సినిమా చేస్తున్న రవితేజ మరొక సినిమా లైన్ లో పెట్టి నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్న రవితేజ డిస్కో రాజా సినిమా తర్వాత చేయబోయే సినిమా కచ్చితంగా హిట్ కొట్టడం గ్యారెంటీ అని ..ఎందుకంటే ఆ ఆ సినిమా డైరెక్ట్ చేయబోయేది ‘ఆర్ ఎక్స్ 100’ డైరెక్టర్ అజయ్ భూపతి అని సమాచారం. ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా తర్వాత నాగచైతన్య తో సినిమా చేద్దామనుకున్న అజయ్ భూపతికి కొన్ని అనివార్య కారణాలు వల్ల సినిమా ఆగిపోవడంతో..మాస్ మహారాజ రవితేజ కి ఒక స్టోరీ చెప్పినట్లు ఆ స్టోరీకి రవితేజ ఎంతగానో ఫిదా అయినట్లు టాక్ వినిపిస్తుంది. కొంత కాలంగా హిట్ అనే మాటకు దూరంగా వుండిపోయిన రవితేజ, అజయ్ భూపతి టాలెంట్ ను గుర్తించి అవకాశమిచ్చాడని దీంతో పక్కా హిట్ కొట్టే డైరెక్టర్ తో రవితేజ సినిమా ఒప్పుకోవడంతో కచ్చితంగా ఇండస్ట్రీలో ఇది తిరుగులేని సినిమా కాబోతుందని రవితేజ కెరీర్లో నిలిచిపోతుందని అంటున్నారు చాలామంది ఇండస్ట్రీకి చెందినవారు.