సుష్మా సాయం కోరిన తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ

వాస్తవం ప్రతినిధి: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ శనివారం లేఖ రాశారు. ఉపాధి కోసం లండన్‌కు వెళ్లి అక్కడ దారుణ హత్యకు గురైన నజీముద్దీన్‌ విషయంలో సాయం చేయాలని కోరారు. మృతి చెందిన యువకుడి కుటుంబ సభ్యులు లండన్‌ వెళ్లేందుకు వీలుగా వీసా ఇప్పించాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.