మరోసారి వాయిదా పడ్డ అయోధ్య భూ వివాదం కేసు

వాస్తవం ప్రతినిధి: అయోధ్యలో రామమందిరం – బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ వివాదం పరిష్కారంపై మధ్యవర్తిత్వ కమిటీ ఈ నెల 6వ తేదీన సుప్రీంకోర్టుకు తన నివేదిక అందజేసింది. ఈ నివేదికపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ ప్రారంభించింది.

ఈ విఙ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఈ వివాదంపై నివేదిక సమర్పించేందుకు ఆగస్టు 15 వరకు సమయమిచ్చింది. సదరు కమిటీ ఇప్పటి వరకు సేకరించిన అభిప్రాయాలు, ఇతర అంశాలను ప్రస్తుతం వెల్లడించడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. పత్రాల అనువాదంలో అభ్యంతరాలు ఉంటే తెలిపేందుకు పిటిషనర్లకు అనుమతినిచ్చింది.

ఈ నెల 7న కమిటీ మధ్యంతర నివేదిక అందిందని, 13,500 పేజీల నివేదికను అనువదించేందుకు కమిటీ కొంత సమయం కోరిందని సీజేఐ గొగోయ్ పేర్కొన్నారు. అయోధ్య భూవివాదం కేసు పరిష్కారంపై కమిటీ ఆశావహ దృక్పథంతో ఉందని, ఆగస్టు 15 కల్లా ఈ సమస్యను పరిష్కరించవచ్చని అన్నారు.