అమెరికాలో NRI ల అభిప్రాయ సేకరణ లో జనసేన పార్టీ వ్యవహారాల చీఫ్

వాస్తవం ప్రతినిధి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల తరువాత జనసేన పార్టీ NRI ల స్పందన తెలుసు కొనే ప్రయత్నం లో భాగంగా ఆ పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ శేఖర్ పులి అమెరికాలో ని పలు రాష్ట్రాల్లో పర్యటించారు. ఈ పర్యటన లో ఆయన వర్జీనియా, న్యూ జెర్సీ, అట్లాంటా, కాలిఫోర్నియా, టెక్సాస్, చికాగో రాష్ట్రాల్లో అనేక మంది తెలుగు ఎన్. ఆర్. ఐ లను కలిశారు.

లక్షల డాలర్లు సంపాదించి పెట్టె తన అమెరికా లోని వ్యాపారాలని వదులుకొని, పవన్ కళ్యాణ్ సిద్దాంతాలకు ఆకర్షితుడై, అయన పిలువు మేరకు జన సేన పార్టీ లో చేరి స్వదేశానికి తిరిగి వెళ్లి జన సేన పార్టీ వ్యవహారాల కమిటీ చీఫ్ గా పని చేస్తున్న శ్రీ శేఖర్ పులి తెలుగు NRI వర్గాల్లో సుపరిచితులు.

కుళ్ళి పోయి బురదలో కూరుకు పోయిన రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యామ్నాయం గా ఆర్భవించిన పార్టీ జనసేన పార్టీ అంటూ, ఆ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో బాగా ప్రాచుర్యాన్ని పొందేలా చూడాలని , నోటు కు ఓటు కొనే సాంప్రదాయానికి భిన్నంగా, కుల తత్వానికి, మత తత్వానికి అతీతంగా ఎన్నికల్లో పోటీ చేసిన జన సేన పార్టీ, ఆ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి, దేశానికి చాలా అవసరం అని తెలుగు ఎన్ .ఆర్.ఐ లు అభిప్రాయ పడినట్లు శ్రీ శేఖర్ పులి తెలియచేసారు.

రాష్ట్ర ఎన్నికల్లో జనసేన కు తెలుగు NRI లు విశేషంగా మద్దతు తెలిపారని, అందుకు పార్టీ సిద్ధాంతాలు, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ రాజకీయ విలువలు, ఆయనకు ప్రజా క్షేమం పట్ల ఫున్న నిబద్దత ముఖ్య కారణాలు గా NRI లు స్పష్టం చేశారని ఆయన వివరించారు.

ఎన్. ఆర్. ఐ లు జనసేన పార్టీ నాలుగు స్తంభాల్లో ఒక ముఖ్య మైన స్తంభం గా నిలబడి జనసేన పార్టీ ని బలోపేతం చేశారని, పార్టీ తరపున వారందరికీ ఆయన తన కృతజ్ఞతలు తెలియచేసి, తమ పార్టీ ఏప్పటికీ వారు కోరుకున్నట్లు సిద్ధాంతాలకు కట్టు బడి ఉంటుంది అని, ప్రజల పక్షాన నిలబడి, ప్రజా క్షేమం కోసం పాటు పడుతూ, నైతిక విలువలున్న రాజకీయాలకు నిబద్దత కలిగి ఉంటుందని శ్రీ శేఖర్ పులి వివరించారు.

శ్రీ శేఖర్ పులి పర్యటనకు ప్రతి చోట వందల కొంది తెలుగు NRI లు హాజరై తమ విలువైన అభిప్రాయాలను తెలియచేశారు. జనసేన పార్టీ ఎప్పటికైనా అధికారంలోకి రావాలన్నదే తమ ధ్యేయం అని వారు బలంగా కోరుకుంటున్నట్లు అయన తెలియ చేశారు.

అట్లాంటా లో

చికాగో లో

   

టెక్సాస్ లో

న్యూ జెర్సీ లో

కాలిఫోర్నియా లో

వర్జీనియా లో