‘మహర్షి’ – రివ్యూ..

రేటింగ్: 3/5 

సినిమా: మహర్షి
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
నటీనటులు: మహేశ్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేశ్, జగపతి బాబు, రాజీవ్ కనకాల, ప్రకాశ్ రాజ్, జయసుధ తదితరులు
నిర్మాతలు: దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రాఫర్: కేయూ మోహనన్
వాస్తవం సినిమా: పాటల తో , టీజర్ తో ప్రేక్షకుల నే కాదు ఫాన్స్ ని కూడా ఆకట్టుకోలేకపోయిన మహర్షి సినిమా బృందం ట్రైలర్ తో మాత్రం ఒకింత పరవాలేదు అనిపించారు. పెద్దగా అంచనాలు కూడా లేని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా నడుస్తుంది ? కథ ఏంటి , మహేష్ మూడు పాత్రల్లో ఎందుకు కనిపించాడు ఇలాంటివి చూద్దాం రండి..

కథ : 

ఒక సాధారణ కాలేజీ స్టూడెంట్ నుంచి వరల్డ్ క్లాస్ మిలియనీర్ గా ఎదిగిన వ్యక్తి తన అసలు స్వరూపాన్ని మర్చిపోయి బతికే బతుకుకి ఒక ఫ్రెండ్ ఇచ్చిన పరమార్ధమే ఈ చిత్రం. అమెరికాలో ఒరిజిన్ కంపెనీ సీఈఓ రిషి(మహష్) ఓటమి అంటే తెలియకుండా సక్సెస్‌ను తన చిరునామాగా మార్చుకుని దూసుకెళుతుంటాడు. ఈ క్రమంలో తన కాలేజీ రోజుల్ని గుర్తుచేసుకుంటాడు రిషి. వైజాగ్‌లో కాలేజీలో చదివే రిషి అందులో కొత్తగా చేరిన రవి(అల్లరి నరేష్)ను సరదాగా ఆటపట్టిస్తాడు. దీంతో వారిద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడుతుంది. వీరిద్దిరతో పాటు పూజా కూడా అదే కాలేజీలో చదువుతుండటంతో ఆమెతో కూడా రిషి స్నేహం చేస్తాడు. తన తండ్రినీ , ఫ్రెండ్స్ నీ అందరినీ లైట్ తీసుకునే రిషి అమెరికా వెళ్లి గొప్ప ధనవంతుడు గా సెటిల్ అవుతాడు. అయితే కాలేజీ ఫ్రెండ్స్ రీ యూనియన్ తరవాత కానీ అతనికి రవి గొప్పతనం తెలీదు. రవి ఏ విధంగా తన జీవితాన్ని ప్రభావితం చేసాడు ,ఏ రకంగా రవి కోసం మళ్ళీ రిషి ఇండియా వెళ్ళాడు. ఇతను వెళ్లే సరికి రవి ఎలాంటి పరిస్థితి లో ఉన్నాడు అనేది ఈ చిత్రం లో చూడాలి. మహర్షి ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా మహేష్ కెరీర్‌లో నిలిచింది. శ్రీమంతుడు, భరత్ అనే నేను తరహాలో మహర్షి సినిమాలో కూడా మహేష్ ఒక మంచి సామాజిక అంశాన్ని లేవనెత్తాడు. రైతులు పడుతున్న కష్టం, వారి పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు మహేష్. సినిమా కథ పూర్తిగా ఎమోషనల్‌తో మిక్స్ చేస్తూ నేటి తరం జనాలకు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించాడు.

పాజిటివ్ లు :

మహేష్ బాబు నటన – స్తూడెంట్ గా , సీఈఓ గా , ఊరు కోసం తపన పడే మనిషి గా మూడు పాత్రలనీ సమానం గా ప్లే చేసాడు మహేష్

పూజా హెగ్డే గ్లామర్

అల్లరి నరేష్ పాత్ర తెరకి ఎక్కించిన తీరు – సినిమా లో అతని అద్భుత క్యారెక్టర్ డెవెలప్మెంట్

క్లైమాక్స్ కాకుండా – ఆఖరి ముప్పై నిమిషాలు

సెకండ్ హాఫ్

నెగెటివ్ లు :

ఫస్ట్ హాఫ్

లాజికల్ సీన్ లు మిస్ అవ్వడం

ఎక్కువ యాక్షన్ సీన్ లు లేకపోవడం

సింపుల్ క్లైమాక్స్

మొత్తం మీద :

సినిమాకు కథే హీరో కావడంతో దాన్ని ఎక్కడా పక్కదారి పట్టించకుండా జాగ్రత్త పడ్డాడు వంశీ. రైతుల కష్టాలను తెలుసుకున్న ఓ కోటీశ్వరుడు సామాన్యుడిగా చేసిన పోరాటాన్ని అద్భుతంగా చూపించాడు వంశీ . అయితే అక్కడక్కడా డౌన్ గా వెళ్ళింది సినిమా. చాలా మటుకు బాగానే లాక్కొచ్చాడు అని చెప్పాలి. అయితే మరీ గొప్పగా కాకుండా మరీ పేలవంగా కాకుండా ఓవర్ ఆల్ గా చూడదగ్గ సినిమాగా మహర్షి ఈ వారాంతం ఫామిలీస్ కి బెస్ట్ ఆప్షన్ !