‘‘దీదీ.. నీ చెంప దెబ్బ కూడా నాకు ఆశీర్వాదమే’’ : మోదీ

వాస్తవం ప్రతినిధి: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని పురులియాలో ఇవాళ ర్యాలీలో పాల్గొన్న మోదీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంతోనే ప్రధాని చెంప పగలగొడతానంటూ’ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఘాటు వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. ‘‘దీదీ.. నీ చెంప దెబ్బ కూడా నాకు ఆశీర్వాదమే’’ అంటూ కౌంటరిచ్చారు.

. ‘‘మిమ్మల్ని దీదీ అని పిలుస్తాను. మీరంటే నాకు చాలా గౌరవం. అందుకే మీ దెబ్బను కూడా నేను ఆశీర్వాదంగా తీసుకుంటానని’’ మోదీ పేర్కొన్నారు . అయితే ‘‘చిట్‌ఫండ్ల ద్వారా పేదవారి నుంచి డబ్బులు దండుకొని, వారిని మోసం చేసిన మీ సహచరులను కొట్టే ధైర్యం ఉందా..?’’ అంటూ ఎదురు ప్రశ్న వేశారు మోదీ. అయితే లోక్‌సభ ఎన్నికల పర్వం చివరి దశకు చేరుకున్న వేళ మోదీ, దీదీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే.