లండన్‌ కోర్టులో నీరవ్‌ మోడీ మూడవ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు

వాస్తవం ప్రతినిధి: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును వేలాది కోట్ల రూపాయిలో మోసం చేసి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీ నేడు లండన్‌లోని కోర్టులో మూడవసారి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నాడు. నీరవ్‌ మోడీ మూడవ బెయిల్‌ పిటిషన్‌పై వెస్ట్‌మినిస్టర్‌ కోర్టులో చీఫ్‌ మెజిస్ట్రేట్‌ ఎమ్మా ఆర్బుత్నాట్‌ విచారణ చేపట్టనున్నారు. కాగా వాండ్స్‌వర్త్‌ జైలులో ఉన్న నీరవ్‌ మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరవుతారా లేక వ్యక్తిగతంగా హాజరవుతారా అనే విషయమై స్పష్టత రాలేదు.