హ్యూస్టన్ జనసైన్యం కార్యకర్తల అభినందన సభ

హ్యూస్టన్ జనసైన్యం ఆద్వర్యంలో జనసేన సెంట్రల్ ఎఫైర్స్ కమిటి చైర్మెన్ శ్రీ. శేఖర్ పులి గారి సమక్షంలొ . హ్యూస్టన్  జనసేన కార్యకర్తల అభినందన సభ దిగ్విజయంగా జరిగింది.

సుమారు 100 మంది జనసేన కార్యకర్తల తో జరిగిన ఈ సభలో, హ్యూస్టన్ నుండి ప్రత్యేకంగా జనసేన అసెంబ్లీ/పార్లమెంట్ ప్రచార నిమిత్తమై ఆంధ్రప్రదేశ్  మరియూ తెలంగాణా క్షేత్రస్థాయి లొ కృషి జరిపిన ఎన్.ఆర్.ఐకార్యకర్తలను ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా అభినందించారు.

హ్యూస్టన్ జనసైన్యం కోఆర్డినేటర్ వెంకట్ శీలం గారి అధ్యక్షతన,  స్వాగతోపన్యాసంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో, శ్రీ. శేఖర్ పులి గారు, శ్రీ. రవి వర్రె మరియూ శ్రీ. చంద్ర శేఖర్ నల్లం గారు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. హ్యూస్టన్ జనసైన్యం కోఆర్డినేటర్స్ శ్రీ. శేషాధ్రి మంచెం గారు మరియు రాజేష్ యాళ్ళబండి గారు, హ్యూస్టన్ జనసేన నాయకులు శ్రీ. గోపాల్ గూడపాటి గారు, డాల్లాస్ ప్రవాస  గర్జన కమిటీ ప్రముఖులు శ్రీ. చిట్టి ముత్యల గారు, శ్రీ. శ్రీనివాస్ అడ్డ ( బాబి ) గారు, సురేష్ లింగినేని గారు వేదికనలంకరించారు.

శ్రీ. రవి వర్రే గారు ప్రవాసాంధ్రుల  విలువైన సమయాన్ని, మేధోసంపత్తిని జనసేన పార్టీకి వినియోగించిన ప్రతీ ఒక్క టీం ని, ప్రతీ ఒక్కరినీ పేరుపేరునా గుర్తుచేసి ధన్యవాదములు తెలియచేశారు. శ్రీ. చంద్ర శేఖర్ నల్లం గారు, ఎన్.ఆర్.ఐ జనసైనికులందరూ జనసేనకు తమ తోడ్పాటును కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. హ్యూస్టన్ జనసైన్యం టీం ఏర్పాటు, 19 నియోజకవర్గాల్లో కార్యకలాపాలను శ్రీ. శేషాధ్రి మంచెం గారు వివరించారు. జిల్లాల్లోని పార్టీపనితీరుని, క్షేత్ర స్థాయి కార్యకలాపాలను, కార్యకర్తల “వాలంటీర్ ఓన్ర్షిప్” ని శ్రీ. గోపాల్ గూడపాటి గారు ప్రశంసించారు. 19 నియోజకవర్గాల వాలంటీర్ కోఆర్డినేటర్లను, వారి క్షేత్ర స్తాయి సహాయ సహకారాలను శ్రీ. రాజేష్యాళ్ళబండి గారు కొనియాడారు. శ్రీ. శేఖర్ పులి గారు, జనసేన సెంట్రల్ ఎఫైర్స్ కమిటి చైర్మెన్ పదవికి సరైన న్యాయంచేశారని, తద్వారా హ్యూస్టన్ జనసైన్యం దత్తత తీసుకున్న 19 నియోజకవర్గాల్లోనే గాక మిగిలిన నియోజకవర్గక్షేత్ర స్థాయి ప్రచార మరియు పార్టీ సామాగ్రి పంపిణిని వంటి కార్యక్రమాలు జరిపినందుకు ధన్యవాదములు తెలిపారు.

జనసేన సెంట్రల్ ఎఫైర్స్ కమిటి చైర్మెన్ శ్రీ. శేఖర్ పులి గారు మాట్లాడుతూ, జనసేన పార్టీని ప్రతీ ఎన్.ఆర్.ఐ ముందుండి నడిపించారని తెలిపారు. జనసేన పార్టీని పటిష్టమైన  ప్రణాళికలతో పూర్తి స్థాయిలో బలోపేతంచేయడానికిఎన్.ఆర్.ఐ లు కృషి జరపాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అంతర్గతంగా మరియూ పూర్తి స్థాయి నిర్మాణానికి తను శ్రీ. పవన్ కళ్యాణ్ గారితో, మిగిలిన పార్టీ  పెద్దలతో జరుపుతున్న కృషిని వివరించారు. రాబోవు పంచాయితీ, ZPTC/MPTC మరియు కార్పోరేషన్ ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్  మరియూ తెలంగాణా రాష్ట్రాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని, జాతీయ స్థాయి రాజకీయాల్లో జనసేన తనదైన ముద్ర వేస్తుందని స్పష్టం చేశారు.

హ్యూస్టన్ జనసైన్యం ప్రచార బాధ్యతలు తీసుకున్న 19 నియోజకవర్గాల వాలంటీర్ కోఆర్డినేటర్లు  చిత్తూరు ( వెంకట్ తాటి ), జగ్గంపేట ( మనోజ్ తోట ), పిఠాపురం ( రాం గారపాటి ), ప్రత్తిపాడు ( నాగ్ మేకల ), కాకినాడ రూరల్ ( సందీప్ రామినేని ), పెద్దాపురం సురేష్ సత్తి, రాజా నగరం ( శేషాధ్రి మంచెం ), ప్రత్తిపాడు “గుంటూర్ జిల్లా” ( జయ కుమార్ తన్నీరు & రాధా కృష్ణ మైనేని ),  నూజువీడు ( ప్రసాద్ లాలం ), పెడన ( నాగు కూనసాని ), విజయవాడ ఈస్ట్ ( వెంకట్ శీలం ), విజయవాడ వెస్ట్ ( రవి నల్లమోతు ), చీరాల ( విజయ్ పింజల ), ఆముదాలవలస ( రాజేష్ గుగ్గిల్ల ), నర్సీపట్నం ( లోవా నాగబాబు రామిశెట్టి,  ప్రవీణ్ రేలంగి, సుధీర్ ఇందాల ), పెందుర్తి ( రోహిత్ పెదమల్లు ), బాపట్ల ( జగదీష్ మెండు ), తణుకు ( రాజేష్ యాళ్ళబండి ) గార్లను శ్రీ. శేఖర్ పులి గారు అభినందించారు. జనసేన హ్యుస్టన్, డాల్లాస్ ప్రవాస  గర్జన, అమెరికా ఎన్.ఆర్.ఐ జనసేన, ఎన్నికల సమయంలో జనసేన సెంట్రల్ ఆఫీస్ నుండి పార్టీ- నియోజకవర్గ అవసరాలను కోఆర్డినేట్ చేసిన జనసేన హ్యుస్టన్ పెద్దదిక్కైన శ్రీ. రవి వర్రే గారినిశ్రీ. శేఖర్ పులి గారు, మరియు ప్రతీ ఒక్క హ్యూస్టన్ జనసైనికులు అభినందించారు. టెక్సాస్ జనసేన కార్యకర్తల సూచనలను, సలహాలను, దీర్ఘకాలిక  ప్రణాళికలకై తమ సహాయాన్నీ శ్రీ. శేఖర్ పులి గారికి వివరించారు.

2019 సార్వత్రిక ఎన్నికలో జనసేన పార్టీకై సహాయ సహకారాలందించడానికై హ్యుస్టన్ ఆంధ్ర ప్రదేశ్  తెలంగాణాలకు వెళ్ళిన అప్పలరాజు సిరిసిపల్లి ( గాజువాక ), రాజా మహావీర్ ( తణుకు ), తిరుమలరావ్ కొండిశెట్టి ( గిద్దలూరు ), ప్రవీణ్ నాయుడు ( సెంట్రల్ ఆఫీస్ కోఆర్డినేషన్ ), అక్షయ్ స్వామిశెట్టి ( వైజాగ్ / తెనాలి ), కిరీటి కోన ( వైజాగ్ పార్లమెంట్ ), దుర్గారావ్ నిప్పులేటి ( ఉంగుటూరు/తణుకు ) గార్లను పేరు పేరునా ధన్యవాదములు తెలియజేశారు.

డాక్టర్ వెంకట్ వీరిశెట్టి మరియు డాక్టర్ శ్రీలత ఎద్దుల గారు శ్రీ. శేఖర్ పులి గారిని పుష్పగుచ్చం, శాలువా మరియు జనసేన హ్యూస్టన్ మెమెంటోతో సన్మానించారు. శేషద్రి మంచెం గారు శ్రీ. రవి వర్రే గారిని పుష్పగుచ్చం, శాలువామరియు జనసేన హ్యూస్టన్ మెమెంటోతో సన్మానించారు. చంద్రశేఖర్ నల్లం గారిని  గోపాల్ గూడపాటి గారు పుష్పగుచ్చం, శాలువా తో సత్కరించారు.

ఈ కార్యక్రమానికి డాల్లస్ జనసేన “కేంపైన్ ఆన్ వీల్స్” ప్రతినిధులు చిట్టి ముత్యల, భాబి, సురేష్ లింగినేని, బసవ శంకర్, శ్రీరాం, వెంకటేష్ లంకా, నరేష్ రౌతు, ఆస్టిన్ జనసేన కార్యకర్తలు శ్రీ. నిర్మల్ తేజ్ జల్దు గారు, శ్రీ. శశి గుణకలగారు విచ్చేసి తమ అభినందనలు తెలియజేశారు.

వీరమహిళలు డాక్టర్ మంజుల రగుతు, శ్రీలత ఎద్దుల, పావని మేకల, లక్ష్మి చిల్లర, శ్వేత, లత తాటి ఈ కార్యక్రమానికి సహకరించారు.

కార్య నిర్వాహకులు వెంకట్ శీలంగారు అతిధులకు, కార్యకర్తలకు, హ్యూస్టన్ జనసైనికులు ఆదిత్య వేమల (వీడియోగ్రఫీ), ప్రసాద్ నాయుడు (ఆడియో/ విజువల్స్), వీరా కంబాల, బద్రుద్ధిన్ పిత్తర్, రాం పులఖండం, సురేష్ సత్తి, ముకుంద గట్టు, శ్రీధర్ దూడల, రాజేష్ పోశినశెట్టి, రవి బండారు, రాజు మేరుగ, కృష్ణ బైరెడ్డి, జగన్ రాయవరపు, మోహన్ చిల్లారి, నరేష్ మద్దింసెట్టి, రాం సింహాద్రి, సుబ్బారావు, వీరా నల్లం, కిరణ్ వర్రే, వెంకట్ బోనం, రాంబండారు, రాజ్ గొరల,  శ్రీనివాస్ పూల వెంకట్ శీలం మొదలగు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియచేశారు. వెంకట్ శీలం గారి  “వోట్ ఆఫ్ థాంక్స్” తో, భారత దేశ  జాతీయ గీతం ” “జన గణ మన” తో “హ్యూస్టన్ జనసేన కార్యకర్తలఅభినందన సభ” దిగ్విజయంగా ముగిసింది.