నాగబాబు భాషపై మండి పడుతున్న నెటిజన్లు..!

వాస్తవం ప్రతినిధి: సరిగ్గా ఎన్నికలకు నెల రోజుల ముందు జనసేన పార్టీ లో పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిన నాగబాబు నరసాపురం పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయడం జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా ఎన్నికలు అయిపోయిన తర్వాత సోషల్ మీడియాలో నాగబాబు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా నాగబాబు వాడిన భాష గురించి మాట్లాడుకుంటూ…ఒక రాజకీయ నేతగా పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన నాగబాబు …ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్న సమయంలో భాష ఏ విధంగా ఉంటుందో చూసుకోరా బాధ్యత గల రాజకీయ నాయకుడిగా ఉంటూ ఇలానేనా మాట్లాడేది అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. ఇంతకీ అసలు మేటర్లోకి వెళితే నాగబాబు ఇటీవల గాజువాకలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయ సంస్కారం మరచి ఆయన విమర్శలు చేశారని అంటున్నారు. తన తమ్ముడు ,జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించేవారు పనికిమాలిన సన్నాసులు, అడ్డగాడిదలు, వెధవలు, రాస్కెల్స్‌.. అని ఆయన అన్నారట. విపక్ష నేతలనుద్దేశించి పరుష పదజాలంతో మాట్లాడటమే ఇప్పుడు చర్చకు తెరలేపింది. నేను చదువుకున్నాను.. హిస్టరీ స్టూడెంట్‌ను.. అని అదే ప్రసంగంలో చెప్పుకున్న నాగబాబు విజ్ఞత, సంస్కారం ఇవేనా అని ప్రశ్నలు వేస్తున్నారు నెటిజన్లు.