పెన్సిల్వేనియా లో ఆప్త వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు

ఆప్త వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు

వాస్తవం ప్రతినిధి : అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త ) పెన్సిల్వేనియా లో గత వారాంతం ఏప్రిల్ 27 వ తేదీ శనివారం , వికారి నామ తెలుగు నూతన సంవత్సర వేడుకలను సాంప్రదాయ బద్దంగా జరుపుకుంది. దాదాపుగా 220 మంది పెన్సిల్వేనియా మరియు డెలావేర్ రాష్ట్రాల ఆప్త సభ్యులు కలిసి నిర్వహించిన ఈ వేడుకలకు ఆప్త అధ్యక్షులు శ్రీ నటరాజ్ ఇల్లూరి, ఆప్త బోర్డు డైరెక్టర్ శ్రీ శ్రీధర్ నిస్సంకరరావు ల తో సహా పలువురు ఆప్త నాయకత్వ సభ్యులు హాజరు అయ్యారు.

ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ నటరాజు , బోర్డు డైరెక్టర్ శ్రీ శ్రీధర్ నిస్సంకరరావు లు ఆప్త సంస్థ చేపట్టబోతున్న రెండు కొత్త సేవా కార్యక్రమాలను ప్రకటించారు. ACERT (APTA Community Emergency Response Team) మరియు ” స్త్రీ ధనం ” అని పిలువబడే ఆ రెండు సేవా కార్యాక్రమాలను ఆప్త సభ్యులకు ఈ వికారి నామ తెలుగు సంవత్సర ఉగాది పర్వదినాన, సభ్యల కరతాళధ్వనులు మధ్య అందించారు.

ఈ సేవల గురించి మాట్లాడుతూ అధ్యక్షులు శ్రీ నటరాజు, ఈ మధ్య కాలంలో మానసిక వత్తిడి, వృత్తి పరమైన వత్తిడి లాంటి అనేక కారణాలతో అకాల మరణాల పాలవుతున్న తెలుగు వారికి ప్రత్యేకంగా ఆప్త సభ్యులకు ధన సహాయం తో సహా వారి కుటుంబాలను ఆపత్కాలంలో ఆదుకోవడం ఈ ACERT సేవా కార్యక్రమ ముఖ్య లక్ష్యంగా తెలియ చేశారు . అలాగే ఆప్త మహిళలకు ప్రత్యేక నిధి ని సమకూర్చి వారి అవసరాలకు ఉపయోగ పడటానికి స్త్రీ ధనం కార్యక్రమాన్ని ప్రారంభించి నట్లు తెలిపారు .

ఈ సంవత్సరం ఆప్త దేశ వ్యాప్తంగా నిర్వహించిన మ్యాథ్ ఒలింపియాడ్ (Math Olympiad ) లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు శ్రీ నటరాజు తన చేతుల మీదుగా విద్యార్థులకు అందచేశారు .

కుమారి మౌనిక తోట, కుమారి రితిక పద్యాల, శ్రీ రఘు వీసం వ్యాఖ్యాతలు గా వ్యవహరించి ఈ తెలుగు ఉగాది వేడుకల్లో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాల ను నిర్వహించారు. చక్కటి నాట్యాల తో పాటు పిల్లల ఫాషన్ షో ను వీరు నిర్వహించారు.

చివరిగా కార్యకర్తలు చక్కటి సాంప్రదాయ రీతిలో అరటి ఆకులలో పసందైన విందు భోజనాలను ఆప్త సభ్యలకు వడ్డించారు .

తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా అరటి ఆకు భోజనాలు వడ్డించడం ఈ కార్యక్రమానికి వచ్చిన అందరిని అమితంగా ఆకర్షించింది. పిల్లలు పెద్దలు తెలుగు భోజనాన్ని మెచ్చుకుంటూ ఆస్వాదించారు. కొందరు పిల్లలు అరటి ఆకుల గురించి తమ తల్లి తండ్రులను అడిగి తెలుసు కోవడం కనిపించింది.

ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన ఆప్త పెన్సిల్వేనియా రాష్ట్ర సమన్వయకర్త శ్రీ గౌరీ కర్రోతు , ఫిలడెల్ఫియా సమన్వయకర్త శ్రీ అనంత్ వాద్రానం, హ్యారిస్ బర్గ్ సమన్వయకర్త శ్రీ గోపీచంద్ పద్యాల, డెలావేర్ రాష్ట్ర సమన్వయకర్త శ్రీ ప్రమోద్ బాలదరి, న్యూ జేర్శి సమన్వయకర్త శ్రీ రమేష్ నయనాల, ఆప్త మీడియా డైరెక్టర్ శ్రీ మురళి శెట్టి, ఆప్త ఎంపైర్ రీజియన్ సమన్వయకర్త శ్రీ ప్రసాద్ తోట లతో సహా ముఖ్య కార్యకర్తలు శ్రీ శ్రీధర్ గుడిశేవ, శ్రీ పెద్దిరాజు కొప్పిరెడ్డి , శ్రీ మతి ఝాన్సీ లక్ష్మి , శ్రీమతి అరుణ బొబ్బిలి , శ్రీమతి కౌసల్య తుమ్మల, శ్రీ మతి సంధ్య, కుమారి మౌనిక తోట , కుమారి రితిక పద్యాల, శ్రీ నరేష్ కొటికలపూడి , శ్రీ నరేష్ ఊట, శ్రీ శ్రీనివాస్ యనమదల, శ్రీ బాల, శ్రీ కృష్ణా ఇనాబత్తిని , శ్రీ ఉదయ్ పాశం తో సహా అనేక మందిని అధ్యక్షులు శ్రీ నటరాజు అభినందించారు .

న్యూ జెర్సీ నుండి ప్రత్యేకంగా వచ్చిన ఆప్త కార్యకర్తలు శ్రీ ఆనంద్ చిక్కాల, శ్రీ కేశవ్ అందే, శ్రీ శ్రీనివాస్ భూషం, శ్రీ రమేష్ నయనాల, శ్రీ బుల్లి కనకాల, శ్రీ ఉమా మహేశ్వర్ రావు అడపాల ఏంతో శ్రమించి కార్యక్రమ విజయానికి తోడ్పడ్డారు.

ఈ కార్యక్రమానికి ఆర్ధికంగా సహాయపడిన తవాస్ సిస్టమ్స్ అధినేత శ్రీ శ్రీనివాస్ అడ్డా , శ్రీ శ్రీనివాస్ యాదంరెడ్డి , శ్రీ రాధికా అంకెం , శ్రీ రాజశేఖర్ తోట , శ్రీ సురేష్ పలనాటి తో సహా అనేక మంది ఇతర కార్యకర్తల కు పెన్సిల్వేనియా మరియు డెలావర్ ఆప్త కార్య వర్గం తమ కృతజ్ఞతలు తెలియచేసింది .