మద్యం మత్తులో  ఓ తండ్రి ఇద్దరు కుమార్తెలను..   

వాస్తవం ప్రతినిధి: ఇద్దరు కూతుళ్లకు ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. ఈసంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేటలో చోటు చేసుకుంది. బ్రెయిన్‌ ట్యూమర్‌తో తన భార్య లక్ష్మీ మృతి చెందింది. గ్యాస్‌స్టవ్‌లు రిపేర్‌ చేసుకుంటూ తన ఇద్దరు కూతుళ్లతో కాలం వెళ్లదీస్తున్నారు బడుగు రాజు. ఇదే క్రమంలో రాత్రి ఇంట్లో తాగిన మత్తులో ఇద్దరు పిల్లలను ఉరివేసి చంపాడు. తాను నోటిలో గుడ్డలు పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.