ఆసియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు రెండు స్వర్ణ పతకాలు

వాస్తవం ప్రతినిధి: ఆసియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు రెండు స్వర్ణ పతకాలు దక్కాయి. పురుషుల 52 కిలోల విభాగంలో అమిత్ పంఘాల్ కు, 56 కిలోల విభాగంలో కవిందర్ సింగ్ బిస్త్ కు స్వర్ణ పతకాలు లభించాయి. చైనా బాక్సర్ హు జియాంగ్ వాన్ పై అమిత్ పంఘాల్, మంగోలియన్ బాక్సర్ పై ఎంఖ్ అమర్ ఖఖూపై బిస్త్ లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. భారత్ కు రెండు స్వర్ణ పతకాలు దక్కడంపై క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.