జమ్ము కాశ్మీర్‌ అసెంబ్లి ఎన్నికలపై ఇ.సి. అత్యున్నత స్థాయి భేటీ

వాస్తవం ప్రతినిధి: జమ్ము కాశ్మీర్‌ శాసనసభకు ఎన్నికలు నిర్వహించే అంశంపై ఎలక్షన్‌ కమిషన్‌ (ఇ.సి.) కసరత్తు ప్రారంభించింది. ఎలక్షన్‌ కమిషన్‌ అధికారులు శుక్రవారంనాడు అత్యున్నత స్థాయి అధికారుల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. జమ్ము కాశ్మీర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బివిఆర్‌ సుబ్రహ్మణ్యం, ఎన్నికల ప్రధానాధికారి శైలేంద్ర కుమార్‌, డిజిపి దిల్బాగ్‌ సింగ్‌, హోం శాఖ కార్యదర్శి షలీనా కాబ్రా నేడు ఇ.సి. బృందంతో సమావేశమై చర్చలు జరుపనున్నారు. ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలపై రాష్ట్ర అధికారుల అభిప్రాయాలను ఇ.సి తెలుసుకుంటుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.