ఆ కంపెనీతో నాకు ఏ మాత్రం సంబంధం లేదు: సుజనా చౌదరి

వాస్తవం ప్రతినిధి: బ్యాంకులకు కొన్ని వందల కోట్ల రూపాయల మొత్తాన్ని నష్టం కలిగించారనే అభియోగాలతో తనకు సీబీఐ నుంచి నోటీసులు జారీ అయిన విషయాన్ని కేంద్ర మాజీ మంత్రి టీడీపీ నేత సుజనా చౌదరి ధ్రువీకరించారు. అయితే ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టుగా తనకూ ఆ వ్యవహారానికి ఏ మాత్రం సంబంధం లేదని చౌదరి ప్రకటించారు.బెస్ట్ అండ్ క్రాంప్టన్ అనే ఆ కంపెనీతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని ఆ కంపెనీ గురించి తనకు తెలియదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు చౌదరి తరఫు నుంచి ఒక ప్రెస్ నోట్ విడుదల అయ్యింది. సుజనా గ్రూప్ లో లిస్టెడ్ అయిన పలు కంపెనీల్లో తను నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులో మాత్రమే కొనసాగినట్టుగా ఆ కంపెనీలపై దాఖలైన అభియోగాలకు తను బాధ్యత వహించాల్సిన అవసరం లేదని చౌదరి పేర్కొన్నారు.2014 వరకూ సదరు సంస్థల్లో తను ఎలాంటి యాజమాన్య బాధ్యతలూ చేపట్టనట్టుగా సుజనా వివరించారు.