వారణాశి లో నామినేషన్‌ దాఖలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ

వాస్తవం ప్రతినిధి: ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. ఇక్కడి కలెక్టర్‌ కార్యాలయంలో వారణాశి లోక్‌సభ నియోజక వర్గంనుంచి బిజెపి అభ్యర్థిగా మోడీ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్న మోడీ ముహూర్తం కోసం కొద్దిసేపు అక్కడ నిరీక్షించారు. అనంతరం కలెక్టర్‌ ఛాంబర్‌లోకి వచ్చి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. మోడీ వెంట అమిత్‌షా, నితీష్‌కుమార్‌ రాజ్‌నాథ్‌ షింగ్‌, రాంవిలాస్‌ పాశ్వాన్‌ తదితరులు కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చారు.