మొత్తం 21 వేలమంది సిబ్బంది అవసరం: ద్వివేది

వాస్తవం ప్రతినిధి: మే 23 న జరుగనున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు మొత్తం 21 వేలమంది సిబ్బంది అవసరమన్నారు ఏపీ ఎన్నిక ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్ష చేసిన అయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎవరు పాల్గొంటారో కూడా తెలియకుండా రెండు సార్లు ర్యాండమైజేషన్ ప్రక్రియ చేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఒక్కో అసెంబ్లీ, లోక్ సభ పరిధిలో ఐదేసి పోలింగ్ కేంద్రాలలో వీవీప్యాట్ లెక్కింపు చేయనున్నామని, ముందుగా పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపు చేసి అనంతరం ఈవీఎంల లెక్కింపు చేస్తారన్నారు. ఒక్కో అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపుకు 15 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తామని, విశాఖ, పగో జిల్లాల నుండి టేబుళ్ల పెంపుకు ప్రతిపాదనలు వచ్చాయనన్నారు. ఒక్కో టేబుల్ వద్ద సూపర్ వైజర్, అసిస్టెంట్లు, మైక్రో అబ్జార్వర్లు ఉంటారన్నారు. రీపోలింగ్ కు సంబంధించి ఈసీఐ నుండి ఆమోదం రావాల్సి ఉందన్నారు.