ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ప్రత్తిపాటి పుల్లారావు ఫైర్

వాస్తవం ప్రతినిధి: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఫైర్ అయ్యారు.రాజకీయ కార్యకలాపాలు మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎస్ కు సూచించారు. చంద్రబాబు అధికారాల్లేని ముఖ్యమంత్రి అనడం ద్వారా ఆయన పరిధి దాటి వ్యవహరించారని విమర్శించారు. హద్దు దాటితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఏ హోదాతో, ఏ అధికారంతో చంద్రబాబుపై ఆ వ్యాఖ్యలు చేశారో ఎల్వీ సుబ్రహ్మణ్యం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రధాన కార్యదర్శి కూడా ఎన్నికల సంఘం నియంత్రణలోనే పని చేయాల్సి ఉండగా కౌంటింగ్ ఏర్పాట్లపై జరిగిన సమీక్ష సీఈవో నిర్వహించినట్లుగా కాకుండా సీఎస్ నిర్వహించినట్లుగా ఉందని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తే సీఎస్ రాజ్యాంగేతర శక్తిగా పని చేస్తున్నట్లు కనిపిస్తున్నదన్నారు. సీఎస్ కుట్ర రాజకీయాల్లో భాగస్వామి అవుతున్నారని ఆయన ఆరోపించారు. పసుపు కుంకుమ, ఫించన్లు, అన్నదాతా సుఖీభవ పథకాలను అడ్డుకోవడానికి సీఎస్ కు అధికారాలు లేవని పుల్లారావు పేర్కొన్నారు.