జయలలిత ఆస్తుల నిర్వహణపై జూన్‌ 6 న తుది విచారణ

వాస్తవం ప్రతినిధి: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల నిర్వహణపై జూన్‌ 6వ తేదీన తుది విచారణను ప్రారంభించనున్నట్లు మద్రాసు హైకోర్టు తెలిపింది. జయలలిత ఆస్తులకు ప్రత్యేక నిర్వాహకుడిని నియమించాలని కోరుతూ అన్నాడీఎంకే కార్యకర్తలు పుగళేంది, జానకీరామన్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. వాటిని నిర్వహించే హక్కు ఆమె మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌లకు లేదని అందులో పేర్కొన్నారు. ఈ కేసుపై ఆదాయ పన్నుశాఖ ఓ నివేదికను కోర్టుకు సమర్పించింది.