ఈ ఎన్నికలతో నమో నామస్మరణ ముగుస్తుంది: మాయావతి

వాస్తవం ప్రతినిధి: ఈ ఎన్నికలతో నమో నామస్మరణ ముగుస్తుందని,తాను చౌకీదార్‌నంటూ మోదీ ఆడుతున్న నాటకాలు ఇక చెల్లవని బహుజన్‌సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి అన్నారు.నేడు యూపీలోని కన్నౌజ్‌లో ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి ఆమె ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ, గత ఎన్నికల్లో అబద్ధపు హామీలనిచ్చి బీజేపీ అధికారంలోకి వచ్చిందని మాయావతి దుయ్యబట్టారు. ఈ ఐదేళ్లలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేసిందన్నారు.

కాంగ్రెస్ విషయమై మాయావతి మాట్లాడుతూ, కుల రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ అధికారంలో ఉండగా రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ అధినేత అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్‌ను, ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆమె ఈ సందర్బంగా ప్రజలను కోరారు.