సుజనా చౌదరి కి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన సీబీఐ..!

వాస్తవం ప్రతినిధి: గత ఏడాది నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార పార్టీకి కేంద్రంలో ఉన్న అధికారపార్టీకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇదే క్రమంలో కేంద్ర విచారణ సంస్థలు   రాష్ట్రంలో విచారణ చేపట్టాలి అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఇటువంటి తరుణంలో కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్న టిడిపి నాయకులు సుజనాచౌదరికి దిమ్మతిరిగిపోయే విధంగా కేంద్ర విచారణ సంస్థ సీబీఐ నోటీసులు జారీ చేసింది. విషయంలోకి వెళితే బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని రుణాలను ఎగ్గొట్టే కేసు విషయమై ఇటీవల టీడీపీ ఎంపీ సుజ‌నా చౌద‌రికి సీబీఐ కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. ఈ కేసు విషయమై సుజనా చౌదరి ని ప్రశ్నించే నిమిత్తం సీబీఐ పిలిచినట్టు తెలుస్తోంది. 2017లో ఆంధ్రా బ్యాంకును రూ.71 కోట్ల మేర మోసం చేసిన కేసు నిమిత్తం సీబీఐ బెంగళూరు బ్రాంచ్ ఆయనకు సమన్లు జారీ చేసినట్టు సమాచారం. ఇప్ప‌టికే ఈ కేసుకు సంబంధించి సుజనా చౌదరికి చెందిన రూ. రూ.315 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.