జగనే సీఎం అని తేల్చేసిన ఏపీ సిఎస్ ఎల్ వి సుబ్రహ్మణ్యం..!

వాస్తవం ప్రతినిధి: 2019 ఏపీ సీఎం జగనే అని ఇప్పటికే పలు సర్వేల ఫలితాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు తాజాగా జరిగిన ఎన్నికల సరళి గురించి మీడియా ముందు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కామెంట్లు చేస్తూ ఉన్న తరుణంలో ఏపీ చీఫ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. విషయం ఏమిటంటే ఇటీవల చంద్రబాబు మాట్లాడుతూ జూన్ 8 వరకు నేనే సీఎం అని తేల్చి చెప్పిన క్రమంలో..బాబు చేసిన వ్యాఖ్యలకు ఎల్వీ సుబ్రమణ్యం చెక్ పెట్టారు.మే 23న వచ్చిన ఫలితాల్లో టీడీపీ ప్రభుత్వం మరోసారి ఎన్నిక కాకపోతే ఆయన వెంటనే దిగిపోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రేనని, అయితే, ఆయనకు ఎలాంటి అధికారాలు ఉండవని తేల్చి చెప్పారు. స‌మీక్ష‌లు నిర్వ‌హించే అధికారంకూడా బాబుకు లేద‌ని తేల్చిచెప్పారు. ఎన్నిక‌ల నియ‌మావ‌ళి, రాజ్యాంగం ప్ర‌కారం మే 23న ఎన్నిక‌ల కౌంటింగ్ అనంత‌రం ఫ‌లితాలు వైసీపీ అనుకూలంగా వ‌స్తే వైఎస్ జ‌గ‌న్ ఆ మ‌రుస‌టి రోజే అంటే మే 24వ తేదీ నాడే ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని, ఒక‌వేళ టీడీపీకి అనుకూల ఫ‌లితాలు వెలువ‌డితే చంద్ర‌బాబు త‌న‌కు ఇష్ట‌మొచ్చిన రోజు ప్ర‌మాణ స్వీకారం చేసుకోవ‌చ్చ‌ని సీఎస్ క్లారిటీ ఇచ్చారు. మొత్తం మీద చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం తన వ్యాఖ్యలతో జగనే నెక్స్ట్ ముఖ్యమంత్రి అని తేల్చేసినట్లు కామెంట్లు చేశారు.