సచిన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి: క్రికెట్ దేవుడు, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండుల్క‌ర్ పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా అన్ని వర్గాల నుంచి స‌చిన్ కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అందుతున్నాయి.. ఎపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న ట్విట్ట‌ర్ ద్వారా స‌చిన్ కు బ‌ర్త్ డే విషెస్ తెలిపారు..‘మీ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఎందరో జీవితాలపై చెరగని ముద్రవేశారు. అది తరతరాలకు నిలుస్తుంది. మీలాంటి వారు కొద్దిమంటే ఉంటారు’ అంటూ ట్విట్ చేశారు బాబు.